పారదర్శకంగా బార్ లైసెన్సుల కేటాయింపు

262చూసినవారు
పారదర్శకంగా బార్ లైసెన్సుల కేటాయింపు
మన్యం జిల్లాలో బార్ లైసెన్సుల కేటాయింపు ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించినట్లు జిల్లా రెవిన్యూ అధికారి కె. హేమలత తెలిపారు. పార్వతీపురం, సాలూరు పట్టణాలకు చెందిన నాలుగు బార్ల లైసెన్సుల కేటాయింపు జిల్లా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా డ్రా ద్వారా లాటరీ నిర్వహించి బహిరంగంగా దరఖాస్తుదారులకు చూపించారు. మొత్తం 20 దరఖాస్తులు అందగా, పార్వతీపురంలో మూడు, సాలూరులో ఒక బార్‌కు లైసెన్సులు కేటాయించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది, దరఖాస్తుదారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్