
100% ఇథనాల్ వాహనాలకు కేంద్రం అనుమతి: గడ్కరీ
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో.. భారత ప్రభుత్వం ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల్లో 100 శాతం ఇథనాల్ (E100) వినియోగానికి అధికారిక అనుమతి ఇచ్చింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయాన్ని ప్రకటించారు. E20 లక్ష్యాన్ని ఇప్పటికే చేరుకున్న భారత్, ఇప్పుడు పూర్తిస్థాయి ఇథనాల్ ఆధారిత రవాణా వ్యవస్థ వైపు అడుగులు వేస్తోంది. రాబోయే రెండు నెలల్లో అనేక ఆటోమొబైల్ కంపెనీలు 100 శాతం ఇథనాల్‌తో నడిచే వాహనాలను విడుదల చేయనున్నాయి.




