నెల్లిమర్లలో తడి, పొడి చెత్తపై అవగాహన కార్యక్రమం

517చూసినవారు
నెల్లిమర్లలో తడి, పొడి చెత్తపై అవగాహన కార్యక్రమం
ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా, నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి రామతీర్థం జంక్షన్ వద్ద తడి, పొడి చెత్తను వేరు చేసే విధానంపై కమిషనర్ కిల్లాన అప్పలరాజు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు. నగరంలోని షాపులకు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, తడి, పొడి చెత్తలను వేరు వేరు బుట్టలలో వేసి మున్సిపాలిటీ కార్మికులకు అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్