నెల్లిమర్ల మండలంలో బీజేపీ బలోపేతం: కొత్త సభ్యుల చేరిక

165చూసినవారు
నెల్లిమర్ల మండలంలో బీజేపీ బలోపేతం: కొత్త సభ్యుల చేరిక
నెల్లిమర్ల మండల బిజెపి కార్యాలయం వద్ద శనివారం బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశం జరిగింది. కన్వీనర్, మండల అధ్యక్షుడు బుర్లే శ్రీధర్, మైపాడ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో, బిజెపి పార్టీ ప్రజల్లోకి తీసుకువెళ్లే విధానాలపై చర్చించారు. ఈ సందర్భంగా కొండ గుంపాంకు చెందిన బెల్లాన గౌరీ, పతివాడ ధనుంజయరావు బిజెపిలో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎన్ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్