భోగాపురం నుండి ఢిల్లీకి నేరుగా "ఆకాశ" విమాన సర్వీసు

1580చూసినవారు
భోగాపురం నుండి ఢిల్లీకి నేరుగా "ఆకాశ"  విమాన సర్వీసు
భోగాపురం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి నేరుగా ఆకాశ ఎయిర్లైన్స్ విమాన సర్వీసులను ప్రారంభించనుండటం సంతోషకరంగా ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గురువారం తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజలకు ఢిల్లీ ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడంతో పాటు, ప్రయాణికులకు మరింత ఎంపిక, సౌకర్యాన్ని ఈ కొత్త విమాన సర్వీసు అందిస్తుందని మంత్రి పేర్కొన్నారు. అక్టోబర్ 25వ తేదీ నుంచి ఈ సర్వీసులు ప్రారంభం కానుండగా. ఉదయం 5: 55 కు ఢీల్లీలో ప్రారంభమై 8: 20 కి భోగాపురం చేరుకోనుంది. మళ్ళీ భోగాపురంలో 09: 05 నిమిషాలకు ప్రారంభమై. 11: 30 కు ఢిల్లీ చేరుకుంటుందని కేంద్రమంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్