స్వదేశానికి తిరుగు ప్రయాణమైన జిల్లా మత్స్యకారులు

186చూసినవారు
స్వదేశానికి తిరుగు ప్రయాణమైన జిల్లా మత్స్యకారులు
విజయనగరం జిల్లాకు చెందిన మత్స్యకారులు, బంగ్లాదేశ్‌లో బందీలుగా ఉన్న తర్వాత, మంగళవారం విడుదలయ్యారు. భోగాపురం, పూసపాటిరేగ మండలాలకు చెందిన 8 మంది మత్స్యకారులు బుధవారం సముద్ర మార్గాన స్వదేశానికి బయలుదేరారు. సుందర్బన్ సమీపంలో సరిహద్దు దాటిన తర్వాత, గురువారం ఉదయం భారత్ కోస్టుగార్డుకు అప్పగించనున్నారు. అనంతరం విశాఖపట్నం తీసుకురానున్నారు. వారు ఈనెల 31 లేదా వచ్చే నెల 1న విశాఖ చేరుకుంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్