వేసవిలో కూలీలకు అండగా మాజీ సర్పంచ్ దంపతులు

80చూసినవారు
వేసవిలో కూలీలకు అండగా మాజీ సర్పంచ్ దంపతులు
పూసపాటిరేగ మండలం చోడమ్మా అగ్రహారం పంచాయతీ పరిధిలోని ఉపాధి హామీ పథకం కింద, సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న లంకెళ్లపాలెం గ్రామంలో చెరువు పని చేస్తున్న ఉపాధి శ్రామికులకు మాజీ సర్పంచ్ పిళ్ళా లక్ష్మి నారాయణ, జయభారతి దంపతులు సుమారు రెండు వారాల పాటు మజ్జిగ పంపిణీ చేశారు. మండు వేసవిలో శ్రామికులకు అండగా నిలిచిన ఈ దంపతులకు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ఈ సహాయం ద్వారా కూలీలకు ఉపశమనం లభించింది.

సంబంధిత పోస్ట్