సర్పంచుల సన్మానం: ప్రజా పరిషత్ చైర్మన్ చిన్న శ్రీను ఆధ్వర్యంలో ఘన నివాళి

146చూసినవారు
సర్పంచుల సన్మానం: ప్రజా పరిషత్ చైర్మన్ చిన్న శ్రీను ఆధ్వర్యంలో ఘన నివాళి
రేపటితో ముగియనున్న సర్పంచుల పదవీకాలం సందర్భంగా, ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్, జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఆధ్వర్యంలో భోగాపురం మండలం సర్పంచులను ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన సభలో రాష్ట్ర శాసనమండలి సభ్యులు డాక్టర్ పెనుమత్స వెంకట సూర్యనారాయణ రాజు (సురేష్ బాబు), మండల కన్వీనర్ ఉప్పాడ సూర్యనారాయణ, ఎంపీపీ అనూష, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రావివలస సర్పంచ్ ఉప్పాడ శివారెడ్డిని నాయకులు సన్మానించారు.

సంబంధిత పోస్ట్