నెల్లిమర్ల లో మోస్తారుగా కురుస్తున్న వర్షం

1130చూసినవారు
విజయనగరం, నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో శుక్రవారం ఉదయం నుండి మోస్తరు వర్షపు జల్లులు కొనసాగాయి. అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు ప్రకటించారు. ఈ వర్షాలు వరి నారుకు ఎంతో ఉపయోగపడతాయని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. దీంతో నగర వాతావరణం వేడి నుండి చల్లగా మారిందని స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్