నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి గొల్ల వీధి వినాయక నిమజ్జనాలలో కనులు విందుగా కోలాటం ఆకట్టుకుంది. వినాయకుని విగ్రహానికి 14 రోజులు ప్రత్యేక పూజలు తదితర కార్యక్రమాలతో యాదవ కమిటీ నిర్వహించారు. వినాయక విగ్రహం ఊరేగింపు కు ఆదివారం సాయంత్రం ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువత, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.