నెల్లిమర్ల: పిల్లలకు పోలియో డ్రాప్స్ వేసిన కమిషనర్ అప్పలరాజు

504చూసినవారు
నెల్లిమర్ల: పిల్లలకు పోలియో డ్రాప్స్ వేసిన కమిషనర్ అప్పలరాజు
నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో, నగర కమిషనర్ కిల్లాన అప్పలరాజు ఆధ్వర్యంలో ఆదివారం పిల్లలకు పోలియో డ్రాప్స్ వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 0-5 సంవత్సరాల లోపు పిల్లలకు రెండు చుక్కల పోలియో డ్రాప్స్ వేయించాలని నగర ప్రజలకు సూచించారు. ఈరోజు డ్రాప్స్ వేయించుకోని వారికి 29, 30 తేదీలలో ఇంటింటికీ ఆరోగ్య సిబ్బంది వచ్చి వేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, స్థానిక పిల్లలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్