నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో శుక్రవారం రాత్రి చల్లని గాలులతో కూడిన వర్షం కురిసింది. గత మూడు రోజుల నుండి మృగశిర కార్తె రావడంతో వాతావరణంలో మార్పులు వచ్చి గుమాయింపు ఉక్క పోతతో స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు. ఈరోజు రాత్రి 9 గంటల నుండి నగర పరిసర ప్రాంతాల్లో చల్లని గాలులు ఉరుములు తో కూడిన జల్లులు కురిసాయి. ఈ వాతావరణంతో వాతావరణమంతా చల్లగా మారి స్థానికులకు ఉక్కపోతల నుండి ఉపశమనం అనిపించింది.