నెల్లిమర్ల శ్రీరాముని ఆలయంలో సీతారాముల కళ్యాణం వైభవంగా

726చూసినవారు
విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి గాంధీ నగర్ కాలనీ 14వ వార్డులోని శ్రీరాముని దేవాలయంలో శుక్రవారం సాయంత్రం సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించగా, సాయంత్రం సీతారాముల పల్లకి, సారె ఊరేగింపు మేళతాళాలతో వీధుల్లో ఊరేగించారు. అనంతరం దేవాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్