నెల్లిమర్లలో ఘనంగా టిడిపి వ్యవస్థాపక దినోత్సవం

121చూసినవారు
నెల్లిమర్లలో ఘనంగా టిడిపి వ్యవస్థాపక దినోత్సవం
నెల్లిమర్ల నియోజకవర్గం నెల్లిమర్ల నగర పంచాయతీలో 44వ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ కర్రోతు బంగారాజు, నాయకులు పార్టీ జెండాను ఎగరవేసి, స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని, గౌరవాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సువ్వాడ రవి శేఖర్, గేదెల రాజారావు, లెంక అప్పలనాయుడు, ఆల్తీ శ్రీనివాసరావు, పతివాడ అప్పలనారాయణ, కంది చంద్రశేఖర్, కడగల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్