నెల్లిమర్ల మండలం మొయిద నారాయణపట్నంలో వీధి కుళాయిల నుండి మంచినీరు వృధాగా పోతుండటంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కంట్రోల్ చేసే టాప్‌లు లేకపోవడంతో చాలా రోజులుగా నీరు వృధా అవుతోందని, అధికారులకు తెలియజేసినా పట్టించుకోలేదని వారు తెలిపారు. ఈ వేసవిలో నీటి కొరత ఏర్పడి కొన్నిచోట్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, అధికారులు స్పందించి ఈ సమస్యను సరిచేయాలని కోరారు.