ఆ జంట తమ దాంపత్య జీవితంలోనే కాదు.. చావులో కూడా ఒక్కటైంది. కొత్తవలస టౌన్లో మామిడి రమణమ్మ(78) ఈ నెల 1వ తేదీన అనరోగ్యంతో మరణించారు. భార్య చనిపోవడాన్ని తట్టుకోలేక దిగులుతో భర్త పార్వతీశం (81) కూడా 3వ తేదిన మరణించారు. దీంతో వారి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. తమ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న ఇద్దరూ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.