
నదిలో స్నానాలకు వెళ్లొద్దని తాహసిల్దార్ హెచ్చరిక
పాలకొండ మండలం అన్నవరం, అంపిలి గ్రామాలను సందర్శించిన తాహసిల్దార్ రాధాకృష్ణమూర్తి, కార్తీక మాసం సందర్భంగా నదులలో స్నానాలకు వెళ్లవద్దని మహిళలకు సూచించారు. స్నానాలకు వెళ్లకుండా దండోరా వేయించాలని రెవెన్యూ సిబ్బందికి ఆదేశించారు. గ్రామంలోని పునరావాస కేంద్రాన్ని పరిశీలించి, శిథిలావస్థలో ఉన్న ఇళ్లల్లో నివసిస్తున్న వారిని పునరావాస కేంద్రాల్లో చేర్చాలని సూచించారు.








































