మన్యం జిల్లాలో అక్రమ మద్యం తయారీపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం మోపుతోంది. సీతంపేట మండలంలోని ఉమ్మిగడ్డ, కొత్తవలస గ్రామాల మధ్య గెడ్డ ప్రాంతంలో బుధవారం నిర్వహించిన దాడుల్లో సుమారు 3,800 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను అధికారులు గుర్తించి ధ్వంసం చేశారు. పై అధికారుల ఆదేశాల మేరకు చేపట్టిన ఈ తనిఖీల్లో అక్రమ సారా తయారీకి సిద్ధం చేసిన బెల్లపు ఊటను స్వాధీనం చేసుకుని నిర్మూలించారు. జిల్లాలో అక్రమ మద్యం తయారీ, రవాణా, విక్రయాలపై నిరంతర నిఘా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. అక్రమ మద్యం తయారీలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎ. సంతోష్ హెచ్చరించారు.