45 ఏళ్ల తర్వాత భామినిలో సీఎం పర్యటన

0చూసినవారు
45 ఏళ్ల తర్వాత భామినిలో సీఎం పర్యటన
మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన భామిని మండలానికి సుమారు 45 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు. గతంలో 1962లో అప్పటి సీఎం దామోదర సంజీవయ్య నేరడి బ్యారేజ్ శంకుస్థాపనకు, 1980 సెప్టెంబర్లో వంశధార వరదల బాధితులను పరామర్శించడానికి అప్పటి సీఎం టంగుటూరి అంజయ్య ఈ ప్రాంతంలో పర్యటించారు. ఇప్పుడు చంద్రబాబు రాకతో ఈ ప్రాంత అభివృద్ధిపై ఆశలు చిగురిస్తున్నాయి.