సీతంపేట మండల ప్రత్యేక అధికారి, ఐటీడీఎ ఏపీవో జి. చిన్నబాబు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం, బయోమెట్రిక్ హాజరు నమోదు చేయని 32 మంది సచివాలయ సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మండలంలోని అన్ని గ్రామాలను, కుటుంబాలను ముస్తాబుగా తీర్చిదిద్దాలని పంచాయతీ ప్రత్యేక అధికారులకు ఆయన సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి పంచాయతీ నుంచి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి, దానిని అందంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు.