రోడ్డు ప్రమాదం: గిరిజనుడు మృతి, భార్యకు తీవ్ర గాయాలు

166చూసినవారు
రోడ్డు ప్రమాదం: గిరిజనుడు మృతి, భార్యకు తీవ్ర గాయాలు
సీతంపేట మండలంలోని వాబ జంక్షన్ మలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జంపరకోటకు చెందిన గిరిజనుడు జీలకర్ర మోహనరావు(60) మృతి చెందాడు. పండుగకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. ఈ ప్రమాదంలో ఆయన భార్య వరలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను సీతంపేట ఆసుపత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం రిమ్స్‌కు తరలించారు. మృతుడికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్