
పార్వతీపురం: జిల్లాలో పోస్టాఫీస్ ఉద్యోగాలు.. ఖాళీలు ఇవే
పార్వతీపురం మన్యం, విజయనగరం డివిజన్లలో సీతానగరం, కురుపాం, పెదబొండపల్లి, భీమసింగి, భోగాపురం సహా 66 చోట్ల బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు రూ.12వేల నుంచి రూ.24,470 వరకు జీతం లభిస్తుంది. అర్హతగా పదో తరగతి ఉత్తీర్ణత సరిపోతుంది. ఖాళీల వివరాలను https://indiapost.gov.in/gdsonlineengagement లో చూడవచ్చు.




































