పార్వతీపురం: 104 వాహనాల ద్వారా గ్రామీణ వైద్య సేవలపై కలెక్టర్ సమీక్ష

202చూసినవారు
పార్వతీపురం: 104 వాహనాల ద్వారా గ్రామీణ వైద్య సేవలపై కలెక్టర్ సమీక్ష
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డా. ఎన్ ప్రభాకర్ రెడ్డిని 104 జిల్లా మేనేజర్ ఎస్. కృష్ణ కలెక్టర్ కార్యాలయంలో శనివారం  మర్యాదపూర్వకంగా కలిసి పూలబొకే అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో 104 వాహనాల ద్వారా గ్రామాల్లో అందిస్తున్న వైద్యసేవల పనితీరు, ముఖ్యంగా గిరిజనులకు అందుతున్న వైద్య సేవలు గురించి ఆరా తీశారు. వైద్య సేవలు, మందుల లభ్యత, వైద్య పరీక్షల వివరాలు తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్, ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్