పిడుగుపాటుకు 31 గొర్రెలు, మేకలు మృతి

450చూసినవారు
పిడుగుపాటుకు 31 గొర్రెలు, మేకలు మృతి
పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం నీలంపేట వద్ద పిడుగుపాటుకు 31 గొర్రెలు, మేకలు శుక్రవారం సాయంత్రం  మృతి చెందాయి. హుస్సేన్ పురానికి చెందిన గొర్రెల కాపరులు చిన్ని చిన్నబాబు, గణపతి, దుర్గారావు తమ గొర్రెలను నీలంపేట వద్ద మంద వేసి ఉంచగా, ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగు పడడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. దీంతో బాధితులు లబోదిబోమంటూ, తమను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్