రాజీపేట పరిసరాల్లో ఏనుగుల గుంపు సంచారం

185చూసినవారు
రాజీపేట పరిసరాల్లో ఏనుగుల గుంపు సంచారం
జియ్యమ్మ వలస మండలంలోని రాజీపేట గ్రామ పరిసరాల్లో బుధవారం ఉదయం ఏనుగుల గుంపు సంచరించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. సమీప అటవీ ప్రాంతాల నుంచి ఆహారం కోసం గ్రామాల వైపు వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. ఏనుగుల సంచారం నేపథ్యంలో గ్రామస్థులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా పొలాలకు వెళ్లకూడదని సూచించారు. ఏనుగులు కనిపించిన వెంటనే అటవీ శాఖకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.

సంబంధిత పోస్ట్