సీతానగరం మండలం రేపటివలస గ్రామ పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు మంగళవారం అటవీశాఖ అధికారులు తెలిపారు. ప్రజలు వన్యప్రాణులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయవద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలిఫెంట్ ట్రాకర్స్ నిరంతరం వాటి కదలికలను పర్యవేక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.