డంగబద్ర సమీపంలో ఏనుగుల గుంపు సంచారం

40చూసినవారు
డంగబద్ర సమీపంలో ఏనుగుల గుంపు సంచారం
కొమరాడ మండలం డంగబద్ర గ్రామ సమీపంలో 8 ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు శనివారం తెలిపారు. పరిసర గ్రామాల ప్రజలు పొలాలకు, అటవీ ప్రాంతాలకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఏనుగులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయవద్దని సూచించారు. వ్యవసాయ భూముల్లోకి వస్తే ఎలిఫెంట్ ట్రాకర్స్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఏనుగుల గుంపును అటవీ ప్రాంతాలకు తరలించాలని స్థానిక రైతులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్