మన్యం జిల్లా సీతానగరం మండలం జక్కపేట గ్రామ సమీపంలో శుక్రవారం ఉదయం ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో అటవీ అధికారులు గ్రామస్తులను అప్రమత్తం చేశారు. ఏనుగుల జోలికి వెళ్లవద్దని, పొలాల వైపు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచనలు జారీ చేశారు. వాటి కదలికలపై సమాచారం ఉంటే వెంటనే అటవీ శాఖకు తెలియజేయాలని కోరారు.