ప్రమాద బాధితులకు ‘పీఎం రహత్’ ద్వారా సత్వర చికిత్స అందించాలి

239చూసినవారు
ప్రమాద బాధితులకు ‘పీఎం రహత్’ ద్వారా సత్వర చికిత్స అందించాలి
జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ రోడ్డు ప్రమాద బాధితులకు ‘పీఎం రహత్’ పథకం ద్వారా వెంటనే వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఎస్. భాస్కరరావు ఆదేశించారు. ఈ పథకం కింద బాధితులకు రూ. 1.5 లక్షల వరకు వైద్య ఖర్చులు అందుతాయని, ప్రమాదం జరిగిన తర్వాత గోల్డెన్ అవర్‌లో బాధితులను ఆసుపత్రికి చేర్చిన వారికి రూ. 25 వేల ప్రోత్సాహకం ఉంటుందని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రులు తప్పనిసరిగా ఎంప్యానెల్‌లో నమోదు చేసుకోవాలని, నివేదికలను సకాలంలో సమర్పించాలని సూచించారు. గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు చట్టవిరుద్ధమని హెచ్చరిస్తూ, నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్