యాక్షన్ కొరియోగ్రఫీతో పేరుగాంచిన డైరెక్టర్ జానీ (ఫైట్ మాస్టర్) తన కొత్త సినిమా కోసం విజయనగరం-గజపతినగరం రహదారిలోని బట్లపల్లి సమీపంలోని గద్దపేట గ్రామాన్ని సందర్శించారు. ఇక్కడి పురాతన పరమశివుని దేవాలయం పరిసరాలు, సహజ వాతావరణం, ప్రశాంతత, ప్రాంతీయ ప్రత్యేకతలను ఆయన పరిశీలించారు. యాక్షన్ సన్నివేశాలకు అనువైన లొకేషన్‌గా ఈ ప్రాంతం సరిపోతుందా అని అధ్యయనం చేశారు. ఆలయ కమిటీ సభ్యులు చిత్రీకరణకు అనుమతి మంజూరు చేశారు.