పార్వతీపురం కలెక్టరేట్‌లో రెవెన్యూ సమస్యలపై అసంతృప్తి అర్జీదారులతో కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. భూ వివాదాలు, పాస్‌బుక్స్, రికార్డుల సవరణలపై వినతులు స్వీకరించారు. పెండింగ్ కేసులను తక్షణం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు సమయానికి న్యాయం అందించడమే లక్ష్యమని తెలిపారు. ప్రతి అర్జీకి స్పష్టమైన పరిష్కారం చూపాలని సూచించారు.