భామిని మండలంలో రహదారి ప్రమాదంలో పీసా శంకర్ (30) అనే యువకుడు మృతి చెందాడు. శనివారం సాయంత్రం కొత్తూరు నుంచి తిరిగి వస్తుండగా, అత్తికొత్తూరు ఏబీ రహదారిపై ఎద్దుల బండిని ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. సీతంపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలేరు పీహెచ్సీలో నైట్ వాచ్మెన్ గా పనిచేస్తున్న శంకర్, స్వగ్రామానికి దూరం కావడంతో బాలేరులోనే అద్దెకు ఉంటున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అప్పారావు తెలిపారు.