భామిని: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వంశధార నది

1చూసినవారు
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా భామిని మండలం లివిరి గ్రామంలో వంశధార నది నీటిమట్టం గణనీయంగా పెరిగి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో, నది తీర ప్రాంత గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ అధికారులు సూచించారు. నదిలోకి స్నానానికి వెళ్లడం, చిన్న పిల్లలను నది వైపు వెళ్లనివ్వడం వంటివి చేయవద్దని తల్లిదండ్రులకు హెచ్చరికలు జారీ చేశారు. నది వరద ఉద్ధృతి కారణంగా పడవ ప్రయాణాన్ని నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్