పార్వతీపురంలో మొక్కలు నాటే కార్యక్రమానికి కలెక్టర్ శ్రీకారం

517చూసినవారు
పార్వతీపురంలో మొక్కలు నాటే కార్యక్రమానికి కలెక్టర్ శ్రీకారం
పార్వతీపురంలో పర్యావరణ పరిరక్షణ, నగర సుందరీకరణ లక్ష్యంగా జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర్ రెడ్డి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శనివారం సాయంత్రం బ్రిడ్జి సమీపంలోని ఖాళీ ప్రదేశాల్లో స్వయంగా పాల్గొని పనులను పర్యవేక్షించారు. బ్రిడ్జి ఎడ్జ్ భాగంలో ఇప్పటికే కొబ్బరి మొక్కలు నాటినట్లు, సోమవారం నుంచి మరో వైపున కూడా మొక్కల నాటకం కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. నగరంలోని సెంటర్ డివైడర్లలో అందమైన బోగన్‌విల్లియా మొక్కలను ఏర్పాటు చేసి మరింత అందాన్ని తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్