విజయనగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, వివిధ శాఖల పనితీరుపై సమీక్షించారు. అధికారులు తమ శాఖల ప్రగతిని వివరించగా, పెండింగ్ పనులను వేగవంతం చేయాలని, ప్రజలకు సేవలు సమర్థవంతంగా అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.