బీరుపాడు ఆశ్రమ పాఠశాల దుస్థితిపై ఆందోళన

207చూసినవారు
బీరుపాడు గిరిజన ఆశ్రమ పాఠశాల దయనీయ స్థితిపై సీపీఎం జిల్లా నాయకులు సాంబమూర్తి, ఈశ్వరరావు బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుందని, తరగతి గదులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు. విద్యార్థుల భద్రత కోసం ప్రహరీ, నైట్ వాచ్మెన్, వంట మనుషులు, ఏఎన్ఎంల నియామకం అత్యవసరమని, కొత్త భవన నిర్మాణ పనులు ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్