పార్వతీపురం నియోజకవర్గంలోని గ్రామపంచాయతీల అభివృద్ధికి పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే విజయ్ చంద్ర పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజను కోరారు. మారుమూల గ్రామాలకు రహదారులు, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. కమిషనర్ సానుకూలంగా స్పందించి, అవసరమైన నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.