పార్వతీపురం నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీల అభివృద్ధికి పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే విజయ్ చంద్ర పంచాయితీరాజ్ కమిషనర్ కృష్ణ తేజను కోరారు. పార్వతీపురం పర్యటనకు వచ్చిన కమిషనర్ ను ఎమ్మెల్యే కలిసి గురువారం మొక్కను బహుకరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీల స్థితిగతులను, పలు గ్రామాల్లో ఉన్న సమస్యలను కమిషనర్ కు వివరించి, వాటి పరిష్కారానికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు రహదారులు, ఇతర మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.