ఎరువుల దుకాణాల్లో డీఏఓ భవానీ శంకర్ ఆకస్మిక తనిఖీలు

531చూసినవారు
ఎరువుల దుకాణాల్లో డీఏఓ భవానీ శంకర్ ఆకస్మిక తనిఖీలు
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎరువుల సరఫరా, విక్రయాలు పారదర్శకంగా జరిగేలా జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ) భవానీ శంకర్ ఆధ్వర్యంలో పలు ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉదయం 10 గంటలకు డీఏఓ భవానీ శంకర్, జిల్లా క్వాలిటీ కంట్రోల్ అధికారి ఎస్. రవీంద్రతో కలిసి బొడ్డేపు సత్యనారాయణ ఎరువుల దుకాణంలో తనిఖీలు చేపట్టారు. ఓపెనింగ్ స్టాక్ బుక్, రిజిస్టర్లు, ePOS లెక్కలు, APAIMS నమోదులను పరిశీలించారు. సంగంవలస, గంగపురం గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల్లో ఎరువుల నిల్వలు, విక్రయాల వివరాలను పరిశీలించి స్టాక్‌ను ధృవీకరించారు.

సంబంధిత పోస్ట్