డ్రోన్ నిఘాలో పేకాట రాయుళ్లు పట్టివేత

47చూసినవారు
డ్రోన్ నిఘాలో పేకాట రాయుళ్లు పట్టివేత
పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్. వి. మాధవ్ రెడ్డి ఆదేశాల మేరకు, సీతానగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని చినభోగిలి గ్రామ శివారులో పామ్ ఆయిల్ తోటలో రహస్యంగా పేకాట ఆడుతున్న 8 మందిని డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 3,130 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. పేకాట, గంజాయి, అక్రమ మద్యం రవాణా వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై డ్రోన్ నిఘా మరింత విస్తృతంగా కొనసాగుతుందని పోలీసులు హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్