గరుగుబిల్లి మండలం ఖడ్గవలస, నాగూరు పరిసర ప్రాంతాల్లోని అరటి, చెరుకు తోటల్లో ఏనుగుల గుంపు బుధవారం ఉదయం సంచరించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. దీనితో పరిసర గ్రామాల ప్రజలు, పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏనుగులు కనిపిస్తే ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని అధికారులు హెచ్చరించారు.