బాల కార్మిక నిర్మూలన మనందరి బాధ్యత: కలెక్టర్

82చూసినవారు
బాల కార్మిక నిర్మూలన మనందరి బాధ్యత: కలెక్టర్
మన్యం జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి మాట్లాడుతూ, బాల కార్మిక నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో బాల కార్మిక నిర్మూలనపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బాల కార్మికత్వం ఒక సామాజిక వ్యాధి అని, పిల్లలు పనిలో కాకుండా పాఠశాలలో ఉండాలని తెలిపారు. 14 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం నేరమని, ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల స్థాయి కమిటీలతో షాపులు, హోటళ్లపై తనిఖీలు నిర్వహిస్తామని, పోలీస్ స్టేషన్ల వద్ద అవగాహన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్