సామాజిక మాధ్యమాలను అడ్డాగా చేసుకుని గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ముఠాను నరసరావుపేట పోలీసులు ఛేదించారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయాలు పెంచుకుని గంజాయి కొనుగోలు, విక్రయాలు నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థి సింహాచలం, సాయినాథ్ కలిసి గంజాయిని విక్రయించగా, గుంటూరుకు చెందిన జావేద్, రహంతుల్లా, అతావుల్లాలతో కలిసి నరసరావుపేటలో విక్రయాలు చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.