మన్యం జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి మాట్లాడుతూ, కుష్ఠు వ్యాధి నివారణకు ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తోందని తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కుష్ఠు వ్యాధిపై అవగాహన గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. వ్యాధిగ్రస్తులను చులకనగా చూడకుండా ఆప్యాయంగా వ్యవహరించాలని సూచించారు. నేటి నుంచి వచ్చే నెల 13 వరకు ప్రతి మండలంలో పంచాయతీ కార్యాలయాలు, పాఠశాలలు, హాస్టళ్లు, ఎస్సీ ఎస్టీ కాలనీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి జిల్లాను కుష్టు రహితంగా మార్చాలని కోరారు.