బైరిపురంలో ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం

4చూసినవారు
బైరిపురంలో ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం
పార్వతీపురం జిల్లా బలిజిపేట మండలం బైరిపురం గ్రామంలో గ్రామ పెద్దలు, యువతీ యువకుల ఐకమత్యంతో గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా మితమైన శబ్దంతో డీజే ఏర్పాటు చేసి నిమజ్జనం చేపట్టారు. బొబ్బిలి బ్రహ్మకుమారీస్ సెంటర్ ఇన్‌చార్జి బీకే రాజేశ్వరి ఆధ్వర్యంలో వ్యసనముక్తి ప్రతిజ్ఞ, ధ్యానం కార్యక్రమాలు నిర్వహించడంతో గ్రామంలో మంచి మార్పు వచ్చిందని గ్రామ పెద్దలు, ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజేశ్వరిను సత్కరించి ఈశ్వరీయ కానుక అందించారు. వచ్చే ఏడాది కూడా ఇదే స్ఫూర్తితో ఉత్సవాలు నిర్వహిస్తామని గ్రామస్తులు తెలిపారు.

సంబంధిత పోస్ట్