గుమ్మలక్ష్మీపురం: గాయపడిన యువతి మృతి

469చూసినవారు
గుమ్మలక్ష్మీపురం: గాయపడిన యువతి మృతి
గుమ్మలక్ష్మీ పురం మండలం చాపరాయిజంగిడిభద్ర సమీపంలో ఇటీవల ఆటో బోల్తా పడిన ఘటనలో గాయపడిన టి.సత్యవతి (19) విజయనగరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. వాడబాయి గ్రామానికి చెందిన గోపాల్, ఆల దంపతుల అయిదో సంతానమైన సత్యవతి ఇంటర్ చదువుకుంది. ఈ నెల 20న ఓ వివాహానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చికిత్స అనంతరం బిడ్డ కోలుకుంటుందని భావించిన తల్లిదండ్రులకు తీరని విషాదం మిగిలింది.

సంబంధిత పోస్ట్