పార్వతీపురం పట్టణంలో శుక్రవారం అర్ధరాత్రి భారీ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. రాత్రి 11 గంటల సమయంలో కురిసిన ఈ వర్షం పట్టణ ప్రజలకు ఉపశమనం కలిగించింది. అయితే, భారీ వర్షం కారణంగా కొన్ని వీధుల్లో డ్రైనేజీలు పొంగిపొర్లడంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.