ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIIEA) ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12, 2026న దేశవ్యాప్త సాధారణ సమ్మె నిర్వహించనున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు, బీమా రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐకి అనుమతి, ప్రభుత్వ రంగ బీమా సంస్థల ప్రైవేటీకరణ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ ఈ సమ్మె చేపడుతున్నట్లు నేతలు తెలిపారు. ఎల్‌ఐసీ సహా ప్రభుత్వ రంగ బీమా సంస్థల్లో క్లాస్–3, క్లాస్–4 పోస్టుల్లో తక్షణ నియామకాలు చేపట్టాలని, 1995 పెన్షన్ పథకాన్ని అన్ని ఉద్యోగులకు వర్తింపజేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ సమ్మెకు బీమా ఉద్యోగులు పిలుపునిచ్చారు.