పాచిపెంట మండలం కర్రివలస కూడలిలో బస్ షెల్టర్ లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ గ్రామం నుంచి సాలూరు, పాచిపెంటకు రాకపోకలు సాగించేవారు చెట్టు నీడలో, దాతలు వేసిన బల్లల వద్ద వేచి ఉండాల్సి వస్తోంది. రానున్న వేసవిలో ఈ సమస్య మరింత తీవ్రమవుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి బస్ షెల్టర్ నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.