కొమరాడ: పెన్షన్ ఇప్పించండి సారు..!

1చూసినవారు
కొమరాడ: పెన్షన్ ఇప్పించండి సారు..!
కొమరాడ మండలం విక్రంపురానికి చెందిన ప్రసన్నకుమార్, BPED చేసి ప్రైవేట్ కళాశాలలో పీఈటీగా పనిచేసేవాడు. మూడు సంవత్సరాల క్రితం రైలు ప్రమాదంలో కాలు కోల్పోయి, కుటుంబ పోషణ కోసం ఒక బంకులో పనిచేస్తున్నాడు. మూడు సంవత్సరాలు గడిచినా తనకు పెన్షన్ మంజూరు కాలేదని ఆయన వాపోతున్నాడు. అధికారులు స్పందించి తనకు పెన్షన్ మంజూరు చేయాలని ప్రసన్నకుమార్ కోరుతున్నాడు.

సంబంధిత పోస్ట్